Jul 31,2023 13:56

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : గ్రామంలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దహరివనం పిహెచ్సి వైద్యులు అమ్రాన్‌ అన్నారు. సోమవారం మండలం పరిధిలో పెద్ద హరివనం గ్రామంలో స్థానిక శ్రీగర్జిలింగస్వామి దేవస్థానం ఆలయ ఆవరణంలో వైద్యులు అమ్రాన్‌ ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహించినట్టు ఏఎన్‌ఎంలు పుష్పలత, లక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పి కఅష్ణవేణి తెలిపారు. అనంత మారు మాట్లాడుతూ ... వర్షాకాలంలో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా వంటి వ్యాధులతోపాటు విషజ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి వడగాచిన నీటిని తీసుకోవడం మంచిదని సూచించారు.

22


గ్రామంలో కండ్లకలక (పింక్‌-ఐ) కేసులు : వైద్య శిబిరంలో భాగంగా గ్రామంలో సుమారుగా 20 మందికి పైగా కండ్లకలక ఉన్నట్లు గుర్తించామని, వారికి మందులు, చుక్క మందులు (సిరాపు) అందించామని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కండ్ల కలక వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వల్ల వస్తుందని వివరించారు. ఇది అంటు వ్యాధి అని, వ్యాధి సోకిన వ్యక్తి ఇతరులకు దూరంగా ఉంటూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కండ్లను తాకవద్దని, వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలు, వఅద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గ్రామస్తులకు మందులతోపాటు, రక్త పరీక్షలు చేసి, గ్రామంలో పుర వీధిలో గ్రామ స్వచ్ఛ సిబ్బందితో కలిసి బీజింగ్‌ పౌడర్‌ చల్లించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు పాల్గొన్నారు.