Nov 19,2023 22:53

క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షిస్తున్న మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులు వీక్షించేందుకు స్థానిక గాయత్రి సినిమా థియేటర్‌లో ఏర్పాట్లు చేశారు. మంత్రి సురేష్‌ క్రికెట్‌ అభిమానుల మధ్యలో కూర్చొని క్రికెట్‌ను వీక్షించారు. ఉచితంగా క్రికెట్‌ను వీక్షించే ఏర్పాటు చేయడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మంత్రి సురేష్‌తో కలిసి క్రికెట్‌ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, వైసిపి మండల కన్వీనర్లు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, బోగోలు వెంకట సుబ్బారెడ్డి, జడ్‌పిటిసి చేదూరి విజయభాస్కర్‌, సచివాలయ మండల కన్వీనర్‌ సయ్యద్‌ జబివుల్లా, సోషల్‌ మీడియా నియోజకవర్గ కో కన్వీనర్‌ షేక్‌ ఖాసింబాషా, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం : వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా స్థానిక విజయా టాకీస్‌ వద్ద క్రికెట్‌ అభిమానులతో సందడి నెలకొంది. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్‌ అభిమానుల కోసం 16వ వార్డు కౌన్సిలర్‌ దారివేముల హర్షిత బాబి సహకారంతో విజయా టాకీస్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ లైవ్‌ ప్రసారం చేశారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉచితంగా అవకాశం కల్పించడంతో క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పట్టణ ఎస్‌ పి.కోటేశ్వరరావు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీ కృష్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించారు.