Nov 18,2023 23:55

పాఠశాలల్లో వసతుల పరిశీలన


పాఠశాలల్లో వసతుల పరిశీలన
ప్రజాశక్తి- బుచ్చినాయుడు కండ్రిగ: తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో శనివారం ఉదయం మండల విద్యాశాఖ అధికారి కే రవీంద్రనాథ్‌ పలు పాఠశాలలను పరిశీలించారు. మొదట తలారివెట్టు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల చదువును వారి కనీస వసతుల గురించి, మధ్యాహ్న భోజనం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌ నగర్‌ ప్రాథమిక పాఠశాలలో పర్యటించి విద్యార్థులు చదువు ఏ స్థాయిలో వుందో విద్యార్థిని విద్యార్థులను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వారి రోజువారి హోంవర్క్‌ను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు రోజువారి హోంవర్క్‌ ఇచ్చి ఉదయం పాఠశాలకు వచ్చేటప్పుడు కచ్చితంగా చేసుకొని రావాలని, అందుకు తల్లిదండ్రులదే బాధ్యత వహించా లన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలో మాత్రమే క్రమశిక్షణతో కూడిన చదువును నేర్పించవచ్చని మిగిలిన సమయంలో విద్యార్థిని విద్యార్థుల చదువు సంధ్యల విషయం తల్లిదండ్రులు పూర్తిగా బాధ్యత వహిం చాలన్నారు. అనంతరం కరకంబట్టు గ్రామ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు జగనన్న కానుక కిట్లతో వస్తున్నారా? లేదా? ఉపాధ్యా యులను అడిగి తెలుసుకుని అనంతరం స్కూల్‌ రిజిస్టరు, మధ్యాహ్న భోజన మెనూ క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల పట్ల ఎలా నడుచుకోవాలో ఉపాధ్యాయులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్ర మంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.