Nov 17,2023 23:04

రూ.40 కోట్లతో పంచాయతీల అభివృద్ధి

రూ.40 కోట్లతో పంచాయతీల అభివృద్ధి
- తుడా ఛైర్మన్‌ మోహిత్‌ రెడ్డి

ప్రజాశక్తి-యర్రావారిపాలెం: 40 కోట్ల రూపాయల నిధులతో 12 పంచాయతీలను మరింత అభివద్ధి చేయడానికి కషి చేస్తున్నామని తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి అన్నారు. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ శివలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం వెలుగు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని తుడా పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత 40 కోట్ల రూపాయల నిధులతో 12 పంచాయతీలను అభివద్ధి చేయడానికి కషి చేస్తున్నామన్నారు. దేశంలోని ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న ప్రభుత్వం అన్ని రంగాలలో అభివద్ధి చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. నేడు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నియో జక వర్గ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. మండలంలో పార్టీలకు అతీతంగా ఇంత అభివద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో విమర్శించడం తగదని వైసీపీ నాయకులు చెంగల్‌ రెడ్డి అన్నారు. మండలంలో హౌసింగ్‌ పై అవకతవకలు ఉన్నా యని సర్పంచ్‌ రమేష్‌ అధికారుల దష్టికి తీసు కొచ్చారు. ఎంపీపీ శివలక్ష్మి, జడ్పిటిసి కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అధికారి ఆయా రంగాలలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అమరనాథ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.