ఉద్యోగుల్లో ఉత్తేజం నింపడానికే క్రీడలు..
ప్రజాశక్తి- రేణిగుంట : అమర రాజా ఉద్యోగుల్లో ఉత్తేజం నింపడానికే క్రీడలు నిర్వహిస్తున్నామని మంగళ్ ఇండిస్టీస్ ఏవిపి సుధాకర్ పేర్కొన్నారు. అమర రాజా 38వ ఫౌండేషన్ డే క్రీడల ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. ప్రతి సంవత్సరం అమర రాజా ఫౌండేషన్ డే సంబరాలు డిసెంబర్ 20వతేదీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమర రాజా ఉద్యోగుల కోసం వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ గ్రౌండ్‌లో క్రికెట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రవికాంత్ రెడ్డి, మంగళ్ ఇండిస్టీస్ లిమిటెడ్ ఏవిపి సుధాకర్, మంగళ్ ఇండిస్టీస్ లిమిటెడ్ జిఎం రమణకుమార్, అమర రాజా ఎలక్ట్రానిక్స్ జిఎం రమేష్ బాబు, మంగళ్ ఇండిస్టీస్ హెచ్ ఆర్ మేనేజర్ రవికుమార్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ క్రికెట్ ప్లేయర్స్ ముందు భద్రతని దష్టిలో పెట్టుకొని ఆడాలని సూచిం చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మంచి టీం స్పిరిట్ తో ఆడాలని తెలిపారు. మన సంస్థ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉద్యోగులలో ఉతేజం నింపడం చాలా ఆనందకర విషయం అని తెలిపారు. అడిగిన వెంటనే ఆడటానికి గ్రౌండ్ ఇచ్చినందుకు డాక్టర్ రవికాంత్ కి కతజ్ఞతలు తెలిపారు. మైదానంలో జరిగిన క్రికెట్‌లో రోస్ మేరీ టీం ఆర్చిడ్ టీం పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. రెండో మ్యాచ్ తులిప్ అండ్ దాహ్లియ మధ్య మ్యాచ్ నిర్వహించారు. మొదట రోజ్మెరి టీం ఆర్చిడ్ టీం పై గెలుపొందింది. ఈ వేడుకకు 38వ ఫౌండేషన్ డే చైర్ పర్సన్ కిరణ్ కుమార్, కో చైర్ పర్సన్ విశోక్ కిరణ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోఆర్డినేటర్ గా భాను ప్రకాష్ పాల్గొన్నారు.