2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఓటర్ల జాబితా సవరణ -2024 కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఆర్వో, ఆర్డీవో చిన్నయ్య, ఏఈఆర్వో, కమిషనర్ డాక్టర్ జె.అరుణ కోరారు. మంగళవారం చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం -2024పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ, ఏఈఆర్వోలు మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 2,3వ తేదీల్లో 'ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన' కార్యక్రమాన్ని పోలింగ్ కేంద్రం స్థాయిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. జనవరి 1, 2024కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న వారు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ గోవర్థన్, జిల్లా సర్వేయర్ రషీద్ భాష, సీఎంఎం గోపి, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.