Aug 21,2023 21:25

న్యూఢిల్లీ : వినియోగదారులకు నష్టం చేసే 43 యాప్స్‌ను తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ వెల్లడించింది. సదరు యాప్స్‌ ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ను తినేయడంతోపాటు యూజర్ల డేటాను తస్కరిస్తున్నాయని హెచ్చరించింది. వినియోగదారుల స్మార్ట్‌ఫోన్లు టర్న్‌ ఆఫ్‌ అయినప్పుడు ఆ యాప్‌లు యాడ్స్‌ లోడ్‌ చేస్తున్నాయి. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీకి విరుద్ధమని పేర్కొంది. ఈ యాప్స్‌ను 25 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకుని ఉన్నారని తెలిపింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీలను ఈ యాప్స్‌ ఉల్లంఘిస్తున్నాయని మొబైల్‌ రీసెర్చ్‌ టీం మైకేఫే పేర్కొంది. ఈ మేరకు గూగుల్‌కు మైకేఫే వెల్లడించింది. వీటిల్లో చాలా యాప్స్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించగా, కొన్నింటిని డెవలపర్స్‌ అప్‌ డేట్‌ చేశారని పేర్కొంది. టివి, డిఎంబి ప్లేయర్స్‌, మ్యూజిక్‌ డెవలపర్స్‌, బారో టీవీ, జిహోసాఫ్ట్‌ మొబైల్‌ రికవరీ యాప్‌, మ్యూజిక్‌ బడా, మ్యూజిక్‌ డౌన్‌లోడర్‌, బారో డిజిటల్‌ గిఫ్టింగ్‌ యాప్‌, న్యూ లైవ్‌, రింగ్‌టోన్స్‌ ఫ్రీ మ్యూజిక్‌, స్ట్రీమ్‌కార్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, లైవ్‌ప్లే తదితర యాప్స్‌ తొలగించిన వాటిలో ఉన్నాయి.