ఇంటర్నెట్‌డెస్క్ : వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని ఓ బామ్మ నిరూపిస్తోంది. 65 ఏళ్లు పైబడినా.. యువతులకు ఏమాత్రం తీసిపోకుండా.. ఎంతో యాక్టివ్‌గా డ్యాన్స్‌లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సోషల్‌మీడియాలో తన డ్యాన్స్‌ల వీడియోలు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. తాజాగా ఆమె రవి.బాల.శర్మ అనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోకెస్టూడియో రూపొందించిన హిట్ ట్రాక్ 'ఖలాసి'కి డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఓ నెటిజన్ అద్భుతంగా డ్యాన్స్ చేశారని వ్యాఖ్యానించారు.