Nov 13,2023 22:35

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : డిసెంబర్‌ 9న బాపట్ల లో జరిగే ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌'' మచిలీపట్నం డివిజన్‌ 55వ మహాసభ లను జయప్రదం చేయాలని కోరుతూ ఇన్సూరెన్స్‌ కార్పొ రేషన్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌, మచిలీపట్నం డివిజన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌ఐసి డివిజనల్‌ కార్యాలయం వద్ద సోమవారం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈసంద ర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి. కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ, పడివిజన్‌ మహాసభ నేపథ్యాన్ని వివరిం చారు. రిక్రూట్మెంట్‌, వేతన సవరణ వంటి డిమాండ్స్‌ పాటుగా ఇన్సూరెన్స్‌ రంగంలో జరుగుతున్న సమకాలీన పరిస్థితులు, పరిణామాలను, ఎల్బీసిలో ప్రభుత్వరంగ వాటాల ఉపసంహరణ నిర్ణయం అనంతర పరిణామాలు, జీవిత బీమా జాతీయీకరణ చట్టానికి సవరణలు వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ వంటి అంశాలను ఈ మహాసభలో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. 5 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు పాల్గొంటున్న ఈ పమహాసభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.యూనియన్‌ అధ్యక్షులు జె. సుధాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవటం, అధిక ధరలను అరికట్టడం, నిరుద్యోగితను తగ్గించడం వంటి వివిధ అంశాలను చర్చించి తీర్మానాలను ఆమో దించనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి. చంద్రపాల్‌, ఎల్‌. రాజశేఖర్‌, వి. ఆర్‌.ఎన్‌. ఠాగూర్‌, ఎమ్‌. రామాంజ నేయులు, వై, స్వామినాథ్‌. బి. శ్రీనివాస పరావు, ఎస్‌.వి. రత్నారావు, ఎ. శ్రీనివాస్‌, బిహెచ్‌. మాధుర్‌ తదితరులు పాల్గొన్నారు.