'నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం..!' అనేది నానుడి. ఇలాంటి రోగాల బారిన పడకుండా.. తెలుగు ప్రేక్షకుల్ని తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించారు హాస్యనటుడు సుధాకర్. హీరోల కోసం, హీరోయిన్ల కోసం సినిమాలు చూస్తుంటారు.. కానీ హాస్యనటుడు సుధాకర్ సినిమాలో ఉన్నారంటే.. ప్రత్యేకించి ఆయన కోసం థియేటర్స్‌కి వెళ్లేవారు ఎందరో. అలాంటి స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సుధాకర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చనిపోయారంటూ.. కొన్ని మీడియాల్లో దుష్ప్రచారం జరిగింది.. 'నేను బతికే ఉన్నాను మొర్రో.. నా నవ్వు ఇంకా ఆగలేదు' అంటూ సుధాకర్ ఒక వీడియో విడుదల చేసి, తన క్షేమ సమాచారాన్ని అందించారు. ఎన్నో సినిమాల్లో నటించిన సుధాకర్ ఈ నెల18వ తేదీన 'ఫాదర్స్ డే' సందర్భంగా 'జీ తెలుగు'లో 'నేను నాన్న' అనే స్పెషల్ ఈవెంట్‌లో కనిపించి, మరోసారి మనముందుకొచ్చారు. ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన కొన్ని విషయాలు.. సుధాకర్ గురించి సినీ జీవిత విశేషాలు తెలుసుకుందాం.
దాదాపు 45 ఏళ్ల పాటు సినీ జగత్తులో నవ్వుల్ని పండించిన సుధాకర్ మరోసారి.. తన పాపులర్ డైలాగ్ ''అబ్బబ్బబ్బా'' అంటూ చెప్పి, నవ్వించే ప్రయత్నం చేశారు. తనలో ఓపిక లేకపోయినా సుధాకర్ ''అబ్బబ్బబ్బా'' అంటూ చెప్పడం చూస్తే ఆయన కళని ఎంతగా అభిమానిస్తారో అర్థమవుతోంది. ఆయన అలా చెప్తుంటే.. మన కళ్లు చెమ్మగిల్లాల్సిందే.
- ఏం చెప్పమంటారు..?
'ఏంటి సుధాకర్ సార్.. మీరు ఇలా ఉండటం మాకేం నచ్చలేదు. ఒక్క ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా 45 ఏళ్లు మా ముఖంపై చిరునవ్వుకు కారణమైన మీరు కదల్లేని.. నడవలేని స్థితిలో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది సార్.. మీరు మళ్లీ నడవాలి.. మీ ముఖంలోని చిత్ర విచిత్రమైన హావభావాలు చూసి మా పొట్టచెక్కలవ్వాలి.. అలాంటి నవ్వులు కావాలి.. మీరు నిండు నూరేళ్లు నవ్వుల్ని పంచుతూనే ఉండాలి సార్..!' అంటే.. ఆయన ఏం చెప్పమంటారు.. నేను బతికే ఉన్నాను. అందుకే మీముందుకొచ్చాను. నా నవ్వు ఇంకా ఆగలేదు.. అంటూ ''అబ్బబ్బబ్బా''' అంటూ నవ్వేశారు.
'హిట్టలర్.. హిట్టలర్.. హిట్టలర్', 'చల్‌ముఖఛల్మ' , 'యో జంబల్ హాట్', 'లప్పాం గిరి గిరి'... 'టేచల్ టేచల్ టేచల్... 'ఏందిరో.. పిచ్చకొట్టుడు కొట్టారు'.. 'అబ్బబ్బబ్బా'.. 'అహ.. డింగిటకా.. అహ డింగిటకా' .. ఆయన మాత్రమే పలకగల ఈ గమ్మత్తైన పదాలతో.. ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టి, నవ్వించేవారు సుధాకర్. దాదాపు 45 ఏళ్ల పాటు.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన నవ్వుల రారాజు సుధాకర్.. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నారు. చివరిగా ''సంక్రాంతి'' సినిమాలో కనిపించిన సుధాకర్‌కి 2020-21 మధ్య బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో దాదాపు 40 రోజుల పాటు కోమాలో ఉండి, తిరిగి బయటపడ్డారు. ఇటీవల సుధాకర్ చనిపోయారంటూ తప్పుడు కథనాలు ప్రసారం కావడంతో వాటిపై క్లారితతతతతతతతతతతటీ ఇస్తూ.. 'తాను బాగానే ఉన్నానని.. తన ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదు' అని వీడియో విడుదల చేసి, తన క్షేమ సమచారాన్ని తెలిపారు సుధాకర్.
- జీవిత విశేషాలు
సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టారు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఊళ్లలో గడిచింది. ఏలూరులో, గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేశారు. భార్య లక్ష్మి కుమారిని తల్లిదండ్రులకు ఇష్టంలేకపోయినా, వివాహం చేసుకున్నారు. వారికి కొడుకు మైఖేల్ బెన్నీ ఉన్నారు.
- ప్రారంభం ఇలా..
ఆయన నటుడు చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావుతో కలసి ఒకే గదిలో ఉండేవారు. ఆయన ఒకసారి అప్పటికి సహాయ దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవడం ఆయన సుధాకర్‌ను 'కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్' సినిమాకి సిఫారసు చేయడం.. అది విజయవంతం కావడం వరుసగా జరిగిపోయాయి. దాదాపు 45 తమిళ చిత్రాలలో సుధాకర్ నటించారు. నటి రాధికతో 18 సినిమాలలో నటించారు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడి నుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడ్డారు. తెలుగులో సుధాకర్ మొదటి చిత్రం ''సష్టి రహస్యాలు''. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు ''ఊరికిచ్చిన మాట, భోగి మంటలు''. ''శుభాకాంక్షలు'', ''స్నేహితులు'' సినిమాలకు నంది పురస్కారాలు అందుకున్నారు.జూజూ