ఈ రోజుల్లో మార్కెట్లో మినీ ల్యాప్‌టాప్‌లకి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అద్భుతమైన ఫీచర్లు సరసమైన ధరలలో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక పుస్తకం తీసుకెళ్లినంత సులభంగా తీసుకెళ్లవొచ్చు. ఇవి చిన్నవిగా, తేలికగా.. సౌకర్యవంతంగా వుంటాయి. ఈ ల్యాప్‌టాప్‌ల స్క్రీన్ పరిమాణం 14-అంగుళాల కంటే తక్కువే ఉంటుంది. ఇవి సాంప్రదాయ ల్యాప్‌టాప్‌ల కంటే నైపుణ్యంలో కొంత తక్కువే అయినా.. అన్ని పనులూ చేయగలవు. ధర కూడా పెద్ద ల్యాప్‌టాప్‌ల కంటే తక్కువ వుంటుంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలో కూడా చిన్న ల్యాప్‌టాప్‌లు ఎక్కువ మన్నికగా వుంటాయి. వీటిని ఎంపిక చేసుకోవడంలో ప్రాథమిక అవగాహన కోసం.. మార్కెట్లో డిమాండ్ ఉన్న మినీ ల్యాప్‌టాప్‌ల వివరాలు తెలుసుకుందాం.
Jio Book 11 (2023): జియో బుక్ 11 అనేది భారతీయ బ్రాండ్. శక్తివంతమైన కాంపాక్ట్ ల్యాప్‌టాప్. ఇది మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ వవీవీజ స్టోరేజ్, మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. వినియోగదారులు ఇన్ఫినిటీ కీబోర్డ్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, 4+LTE కనెక్టివిటీని పొందుతారు. తేలికపాటి డిజైన్‌తో పాటు యాంటీ-గ్లేర్ హెచ్‌డి డిస్‌ప్లే, ఎనిమిది గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ప్రయాణాల్లో దీన్ని ఉపయోగించేవారికి మంచి అనుభవాన్ని అందిస్తుంది.
HP Chromebook 11a: దీని వినియోగదారులు మీడియా టెక్ ఎమ్‌టి8183 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, రెస్పాన్స్‌డ్ టచ్‌స్క్రీన్‌ను పొందుతారు. దీని తేలికపాటి డిజైన్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఎటువంటి అంతరాయం లేకుండా బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులకు యాంటీ గ్లేర్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, గూగుల్ అసిస్టెంట్‌తో సహా అనేక ఫీచర్లు దీనిలో అందుబాటులో వుంటాయి.
Lenovo IdeaPad Slim 3 Chromebook: ఇది ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ వవీవీజ స్టోరేజ్‌తో వుంటుంది. 11.6 అంగుళాల డిస్‌ప్లేతో పాటు దీని వేగం వినియోగదారులకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. దీని బరువు 1.12 కిలోలు. ఇది స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. ప్రయాణాలలో దీన్ని వాడినప్పుడు మిగతా వాటికంటే భిన్నమైన అనుభవం పొందుతారు.
Acer Travel Mate : ఇదొక బిజినెస్ ల్యాప్‌టాప్. ఇంటెల్ పెంటియమ్ ఎన్ 5030 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో వినియోగదారులు 11.6 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, 4జీబీ డిడిఆర్4 ర్యామ్, 128 జీబీ ఎస్‌ఎస్‌డి హార్డ్‌డిస్క్ వంటి గొప్ప ఫీచర్లు దీనిలో లభిస్తాయి. అంతేకాకుండా స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్‌ను పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ చూడటానికి స్లిమ్‌గా స్టైలిష్‌గా ఉంటుంది.
CHUWI HeroBook Air: ఈ ల్యాప్‌టాప్.. పోర్టబిలిటీని పనితీరును మిళితం చేసే అల్ట్రాస్లిమ్ విండోస్ 11 ల్యాప్‌టాప్. ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్ ద్వారా ఆధారితం. ఇది 4జీబీ LPDDR4 RAM, 128జీబీ ఎస్‌ఎస్‌డి స్టోరేజీతో మదువైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. 11.6-అంగుళాల హెచ్‌డి మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లేతో స్ఫుటమైన విజువల్స్‌ను అందిస్తుంది. దీని తేలికపాటి డిజైన్ ప్రయాణంలో ఉపయోగకరంగా వుంటుంది. దీనిలోని అంతర్నిర్మిత హెచ్‌డి కెమెరా ఆన్‌లైన్ తరగతులు, రిమోట్ పని కోసం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనిలోని మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ద్వారా అదనపు స్టోరేజీని పెంచుకోవచ్చు.
ASUS Laptop L210 Ultra Thin Laptop: ఇదొక ఆల్ట్రా-సన్నని, తేలికైన పరికరం. మంచి సామర్థ్యంతో పాటు పోర్టబిలిటీని కూడా అందిస్తుంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ వవీవీజ స్టోరేజ్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ రోజువారీ పనులకు అనుకూలంగా ఉంటుంది. 11.6 అంగుళాల హెచ్‌డి స్లిమ్ డిస్‌ప్లే మంచి విజువల్స్‌ను అందిస్తుంది. ఇది ఎస్ మోడ్‌లో విండోస్ 10తో వస్తుంది. మైక్రోసాఫ్ట్ 365 పర్సనల్‌ని ఏడాదిపాటు అందిస్తుంది. స్లిమ్‌గా వుండటంతో పాటు తేలికైన డిజైన్ కావడంతో ప్రయాణంలో వినియోగానికి అనువుగా వుంటుంది. అయితే, దీనిలోని పరిమిత స్టోరేజీ వల్ల వినియోగదారులు క్లౌడ్ స్టోరేజ్ లేదా పెద్ద ఫైల్స్ కోసం ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లపై ఆధారపడాల్సి రావచ్చు.