దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీరను సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తాం. అయితే ఈ పదార్ధాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక సమస్యల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వీటితో కషాయాలను తయారు చేసుకుని తాగితే, రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
మలబద్ధకం : మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర వేసి కషాయం తయారుచేసుకుని తాగాలి. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. అజీర్ణం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
డి టాక్సేషన్ : శరీరం డి టాక్సేషన్‌కి గురికాకుండా ఉండాలంటే ఈ పదార్థాలతో చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజూ తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని విషపదార్థాలు బయటికి పోతాయి.
ఊబకాయం : శరీర బరువును తగ్గించడంలో కూడా ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
రోగనిరోధక శక్తి : ఈ కషాయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక లక్షణాలు ఉన్నాయి.
జలుబు, దగ్గు : చలికాలంలో వచ్చే సమస్యల్లో జలుబు, దగ్గు ఒకటి. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే ఈ కషాయాన్ని ప్రతిరోజూ తాగాలి.