Nov 12,2023 10:32

పాపాయి ఏడ్చింది
టపాకాయలు అడిగింది

వద్దమ్మ.. వద్దని
అమ్మమ్మ చెప్పింది

పాపాయి అలిగింది
మంకు పట్టు పట్టింది

గాయాలు అవుతాయని
నానమ్మ చెప్పింది

పాపాయి ఒప్పుకోక
బుంగమూతి పెట్టింది

కాలుష్యమవుతుందని
తాతయ్య చెప్పాడు

పాపాయి ఊరుకోక
మారాము చేసింది

మామయ్య వచ్చాడు
ప్రమిదలు వెలిగించాడు

కాంతులు విరచిమ్మింది
పాపాయి నవ్వింది!

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
94417 81239.