Jul 23,2023 17:05

మహేష్‌బాబు కూతురు సితార పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు. నిత్యం సోషల్‌ మీడియాలో తన యాక్టివిటీస్‌తో అలరిస్తూ ఉంటుంది. లేటెస్టుగా ఈమె ఓ జ్యూయలరీ యాడ్‌లో కనిపించింది. అయితే ఫస్ట్‌ యాడ్‌లోనే తన ఫొటోలతో ఆకట్టుకుంది. ఈ యాడ్‌ చేయగా ఆమెకు కంపెనీ వాళ్లు కోటి రూపాయలు ఇచ్చారు. కానీ ఈ విషయం సితార గానీ, మహేష్‌ దంపతులుగానీ వెల్లడించలేదు. అయితే సితార మాత్రం తనకు వచ్చిన పారితోషికాన్ని ఓ ఛారిటబుల్‌ ట్రస్టుకు దానం చేసి, తండ్రికి తగ్గ తనయగా.. అందరి మన్ననలూ పొందుతోంది.
చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సితార సినిమాల్లోకి రావాలని కూచిపూడి నేర్చుకుంది. సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతోంది. గతంలో పిల్లలకు సంబంధించిన ఛానల్‌ కూడా నడిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్పుడూ ఫోటోస్‌, డ్యాన్స్‌ వీడియోలు అప్లోడ్‌ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ఆ మధ్య మహేశ్‌ నటించిన 'సర్కారివారి పాట' సినిమాలో ఓ పాటకు డ్యాన్స్‌ చేసింది. తాను చేసిన డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. అవి బాగా వైరల్‌ కూడా అయ్యాయి. దాంతో గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ సంస్థ అయిన పీఎంజే జ్యుయలరీ యాడ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అవకాశం వచ్చింది. యాడ్‌ బయటకు రాకముందే దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో విడుదల అయ్యాయి. అంతేకాదు ఆ బ్రాండ్‌ జ్యుయలరీ సితార ధరించిన ఫోటోలను, దానికి సంబంధించిన యాడ్స్‌ను న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రదర్శించడం విశేషం. నిజానికి సితార ఆ యాడ్‌లో కుందనపు బొమ్మల ఉంది. చిన్న వయస్సులో ఇంత గుర్తింపు పొందిన కూతుర్ని చూసి మహేష్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.

2


'జ్యుయలరీ యాడ్‌లో నటించడం హ్యాపీగా ఉంది. షూట్‌ ఎంతో సరదాగా జరిగింది. అందరూ నాకు మద్దతుగా నిలిచారు. నా ఫొటోలను న్యూయార్క్‌ టైవ్‌ స్క్వేర్‌పై ప్రదర్శించిన రోజైతే.. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. నాన్నను హగ్‌ చేసుకుని ఎమోషనల్‌ అయ్యాను. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. నా మొదటి పారితోషికాన్ని సేవా కార్యక్రమాల కోసం ఇచ్చా. మా అమ్మను చూసి ఆత్మవిశ్వాసం అలవరుచుకున్నా!' అని సితార చెప్పింది.
నిజానికి మహేష్‌బాబు కూడా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్‌ సర్వీస్‌ చేస్తున్నారు. తాను బిజీగా ఉన్నా సరే నమ్రత ఆ కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్‌తో కలిపి ఇప్పటివరకు దాదాపు 1,000 మంది చిన్నారులకు మహేష్‌ గుండె ఆపరేషన్లు చేయించారు. ఇప్పుడు మహేష్‌ బాటలోనే సితార నడుస్తుంది. తనకు కోటి రూపాయలు వస్తే వాటిని ఏవైనా కొనుక్కోవాలని ఆశపడకుండా ఛారిటీకి ఇవ్వడం అభినందించాల్సిన విషయం.
దర్శకుడు రాజమౌళి.. మహేష్‌బాబుతో కలిసి ఓ పాన్‌ వరల్డ్‌ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతోంది. ఈ సినిమాలో ఓ 20 నిమిషాల పాటు జరిగే కథలో సితార కనిపించనుంది. ఆమెతో పాటు ఎన్టీఆర్‌ కొడుకు అభరు రామ్‌ కూడా నటించబోతున్నాడు. వీరిద్దరూ అక్కాతమ్ముళ్లు గా కనిపించనున్నారు. ఇలా తండ్రి నటిస్తున్న సినిమాలో తాను నటించడం ఎంతో సంతోషంగా ఉందని సితార చెబుతోంది.

3

అసలు పేరు : సితార ఘట్టమనేని
పుట్టిన తేదీ : జూలై 20, 2012.
తల్లిదండ్రులు : సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌ (నటి),
అన్నయ్య : గౌతమ్‌ ఘట్టమనేని
(చైల్డ్‌ ఆర్టిస్ట్‌)
జన్మస్థలం : హైదరాబాద్‌,
తెలంగాణ రాష్ట్రం.
స్కూలు : చెరిక్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు,
బెస్ట్‌ ఫ్రెండ్‌ : ఆద్య పైడిపల్లి
(సినీ దర్శకుడు
వంశీ పైడిపల్లి కుమార్తె)