ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు మద్దతుగా నిర్వహిస్తున్న సంఘీభావ సదస్సుల అనంతరం ఈ యాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 24 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 33 రోజుల పాటు సాగనుంది. స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలు కూలంకషంగా తెలుసుకునే లక్ష్యంతో ఈ యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.
నెల్లూరు రూరల్ లో @ncbn గారికి మద్దతుగా సంఘీభావ సదస్సులు తర్వాత 33 రోజుల పాటు లక్ష మందిని కలిసే లక్ష్యంగా పాదయాత్రకు శ్రీకారం.
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) October 13, 2023
లక్ష మంది ప్రజలతో స్థానిక పరిస్థితులు, సమస్యలు తెలుసుకొని వారితో మమేకం కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగే ఈ కార్యక్రమానికి మీ అందరి దీవెనెలు కోరుతున్నాను. pic.twitter.com/pkOGcGm2p8