ఉగాదులెన్ని వచ్చినా యుగాలు ఎన్ని మారినా
పండగలెన్ని దండిగా వచ్చినా మెండుగా వచ్చినా
పచ్చదనం అంతరిస్తే సంపదలిక దేనికి
మొక్కలు అంతరిస్తే మనకు లేదు ఉనికి
కాలుష్యపు కోరలు పీకే అస్త్రం
ఆనందాల హరివిల్లు కురిపించే శస్త్రం
భావితరాల మనుగడకు బ్రహ్మాస్త్రం
జీవవైవిధ్యానికి రక్షకతంత్రం
అదే పచ్చదనం పదేపదే చైతన్యపథం
కలిసిసాగాల్సిన ఉద్యమ చైతన్యం
చేయిచేయి కలపాల్సిన తరుణం!
పి. అలేఖ్య,
5వ తరగతి, రామచంద్రాపురం
మం.ప. ప్రాథమికోన్నత పాఠశాల,
బుచ్చిరెడ్డిపాళెం,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.