చల్లపల్లి : తీవ్రమైన ఆర్థిక సమస్యలతో చల్లపల్లి సిటీ కేబుల్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. జర్నలిజం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కఅషి చేస్తున్న చంద్ర గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తహశీల్దార్ కార్యాలయం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. 'నా బిడ్డకి హాస్టల్ ఫీజు కూడా కట్టలేకపోయాను. అందుకే చివరికి ఇలా..' అంటూ చంద్ర రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరినీ కలచి వేసింది.