న్యూఢిల్లీ : నాలుగు టెక్ కంపెనీలు ఎఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)ను వాచ్‌డాగ్‌లా ఉపయోగించనున్నాయి. ఆంత్రోపిక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఎఐ వంటి నాలుగు కంపెనీలు అభివృద్ధి చెందుతున్న ఎఐ మోడల్స్‌ను భద్రత, బాధ్యతను నిర్ధారించడానికి వాచ్‌డాగ్‌గా వ్యవహరించేందుకు ఉపయోగించనున్నట్లు ప్రకటించాయి. ఫ్రాంటియర్ మోడల్ ఫోరమ్ అని పిలువబడే సంస్థ కృత్రిమ మేథస్సును ఉపయోగించుకునేందుకు దాని సభ్య కంపెనీల సాంకేతికత దాని కార్యచరణ నైపుణ్యాన్ని ఉపయోగించుకోబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తన బ్లాగ్‌లో తెలిపింది. ఈ కంపెనీలన్నీ సాంకేతిక మూల్యాంకనాలపై దృష్టి పెట్టి ఓ బెంచ్‌మార్క్‌ను సెట్ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ టెక్నాలజీ పరిశ్రమలలో ఉత్తమ పద్ధతుల్ని, ప్రమాణాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే సమాచారం కోసం పబ్లిక్ లైబ్రరీని కూడా అభివృద్ధి చేసే అవకాశముందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
'ప్రభుత్వాలు, పరిశ్రమలు ఎఐ వల్ల కలిగే ప్రయోజనాన్ని అంగీకరిస్తాయి. కానీ ప్రమాదాలను తగ్గించడానికి తగిన రక్షణ మార్గాలు అవసరం. ఈ ప్రయత్నాలకు ఇప్పటికే అమెరికా, లండన్, యూరోపియన్ యూనియన్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన అండ్ డెవలప్‌మెంట్ (ఓఇసిడి), జి7 దేశాలు ఎఐ ద్వారా సహకారాన్ని అందించాయి' అని మైక్రోసాఫ్ట్ బ్లాగ్‌లో పేర్కొంది. కృత్రిమ మేథస్సు వలన కలిగే నష్టాలను తగ్గించడం, అలాగే దానివల్ల కలిగే ప్రయోజనాలను అమలు చేసే సంస్థలకు సభ్యత్వం కోసం ఫ్రాంటియర్ మోడల్ ఫోరమ్ కంపెనీలకు పిలుపునిచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.