Nov 12,2023 13:17

ఒక పల్లెటూరిలో నిరుపేద కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండేవారు. తండ్రి పేరు నర్సయ్య, తల్లి పేరు నర్సమ్మ, వారికి ఇద్దరు అమ్మాయిలు. ఆ కుటుంబం మొత్తం నర్సయ్య మీద ఆధారపడి బతికేవారు. ఇంటి పెద్ద నర్సయ్య వ్యవసాయం చేస్తూ, పశువులను, గొర్రెలను కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే వారికి ఉన్న గొర్రె పిల్లలనమ్మి, ఖర్చులు తీర్చేవాడు. నర్సయ్యకు ఇద్దరు కూతుర్లలో పెద్ద కూతురు చాలా చురుకైనది. ఆమెకు చదవంటే చాలా ఇష్టం. పదవ తరగతి చదువుతుంది. కుటుంబ పరిస్థితుల రీత్యా ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి చేయాలని అనుకుంటుంటారు. కానీ ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. బాగా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని ఉండేది. అయినా పదవ తరగతి అయిపోగానే పెళ్లి చేయాలని చూస్తారు. కానీ ఆ అమ్మాయి చదువుకుంటానని పట్టుబడుతుంది. దానితో వాళ్ల నాన్న నర్సయ్య ఒప్పుకుంటాడు. పట్టుదలతో చదివి, కష్టపడి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. తన చెల్లిని బాగా చదివిస్తుంది. ఆ ఊరిలోని వారంతా ఆ అమ్మాయిని చూసి, చాలా సంతోషపడతారు. మిగతా వాళ్ళు కూడా తమ తమ కూతురులను చదివించడానికి పూనుకుంటారు. చదువు అనేది గొప్ప వరం. అది అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా చాలా అవసరం. నర్సయ్య కూతురు పట్టుదలతో చదివి, ఎందరో అమ్మాయిలకు మార్గదర్శకురాలిగా నిలిచింది.

kavya

జి. కావ్య
9వ తరగతి,
తెలంగాణ ఆదర్శ పాఠశాల,
బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.