బెంగళూరు : చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనల్లో మరిన్ని కీలక అంశాలను గుర్తించింది. రోవర్‌లోని 'లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (లిబ్స్)' పరికరం.. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉపరితలంపై సల్ఫర్ ఉనికిని స్పష్టంగా గుర్తించినట్లు ఇస్రో తాజాగా వెల ్లడించింది. దీంతోపాటు అల్యూమినియం, కాల్షియం, ఫెర్రమ్ (ఇనుము), క్రోమి యం, టైటానియం, సిలికాన్, మాంగనీస్, ఆక్సిజన్ మూలకాలను సైతం ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించడం విశేషం. హైడ్రోజన్ కోసం శోధన కొనసాగుతుందని ఇస్రో తెలిపింది. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు.. అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకుగానూ 'లిబ్స్' పరికరాన్ని పంపించారు. ఈ పరిక రాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు.