న్యూఢిల్లీ : స్టాక్ ధరల తారుమారుకు అదానీ గ్రూపు ప్రయత్నించిందన్న ఆరోపణలకు సంబంధిం చిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను విచారించే అంశాన్ని లిస్టింగ్‌లో పెట్టడంపై రిజిస్ట్రీ పరిశీలిస్తుం దని సుప్రీం కోర్టు సోమవారం తెలిపింది. ఆగస్టు 28న ఈ పిటిషన్లను విచారించాల్సి వుందని, కానీ అప్పటి నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. దీనిపై రిజిస్ట్రీతో మాట్లాడతామని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. అదానీ గ్రూపు పాల్పడిన అవకతవకల ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు స్థితిగతుల గురించి తెలియజేయాల్సిందిగా జులై 11న సెబీని సుప్రీం కోరింది. దర్యాప్తు పూర్తి చేసేందుకు ఆగస్టు 14వరకు గడువు ఇచ్చింది. అనంతరం సెబి ఒక నివేదికను అందజేసింది. పన్నులకు స్వర్గధామాలుగా భావించే దేశాల నుండి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.