కొండ మీద చందమామ
కొలనులోని కలువ భామ
కొమ్మ మీద కోకిలమ్మ
కమ్మనైన కూనలమ్మ
నింగిలోని సూరీడమ్మ
పొంగి పోయె పంకజమ్మ
కరిమబ్బు చూసి నెమలమ్మ
మైమరచి ఆడె ఓయమ్మ
హాయిగ ఊగే పూలకొమ్మ
వేయిగ మనసే మురిసెనమ్మ
ఝమ్మని పాడే తుమ్మెదమ్మ
కమ్మని కబుర్లె చెప్పెనమ్మ
తియ్యని తేటల తేనెలమ్మ
తెలుగు మాటల కోయిలమ్మ
- గుండాల నరేంద్రబాబు,
94932 35992.