చీర కొంగుకి కుచ్చులుంటే ఎలాంటి చీర అయినా సరే.. చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇప్పుడు అవే కుచ్చులు ఒక్క కొంగుకు మాత్రమే కాకుండా.. చీర మొత్తం ఉంటే.. అదే లేటెస్ట్ ఫ్యాషన్. ఆ చీరకు తగ్గట్టుగా, ఆయా రంగుల్లో తీసుకుని, కుట్టించుకుంటే చూడ్డానికే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు చీరలను అలా డిజైనింగ్ చేసి రెడీమేడ్‌గా కుచ్చులు పెట్టి కుట్టేస్తున్నారు. ఫ్రిల్స్తో శారీలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో లేటెస్ట్ ట్రెండ్.. మరి చీరలకు కుచ్చు అందం.. అని పాడుకోవడమే..!