ఎంతో అనుభవం ఉంటేనే గానీ చిత్ర రంగంలో, రాజకీయాల్లో రెండింటిలోనూ రాణించడం సాధ్యపడదు. అలాంటిది ఉదయనిధి స్టాలిన్ చిన్న వయస్సులోనే తనదైన స్ట్లైల్లో సినిమాల్లో నటిస్తూ, రాజకీయరంగంలో ప్రవేశించారు. ఆయన చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. ఇటు అభిమానులకు, అటు ప్రజలకు దగ్గరవుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.
ఉదయనిధి స్టాలిన్ 1977, నవంబరు 27న స్టాలిన్, దుర్గా దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కుమారుడు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనువడు. ఉదయనిధి పాఠశాల విద్యను చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో, మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు. తరువాత, అతను చెన్నైలోని లయోలా కళాశాల నుండి విజువల్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించారు. అతను మొదట ఫిల్మ్ ఇండిస్టీలో డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2008లో రెడ్ జెయింట్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన తమిళ చిత్రాలను నిర్మించారు. స్టాలిన్ రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండటంతో తండ్రి స్టాలిన్ ప్రోత్సహించారు. అభ్యుదయ భావాలు గల రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను ఎప్పుడూ చదువుతూ ఉంటారు. తాతయ్య కరుణానిధి చెప్పే రాజకీయ విషయాలు బాల్యంలో శ్రద్ధగా వింటూ ఉండేవారు. గత ఏడాది తమిళనాడు యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధికి మంత్రిగా నియమించబడ్డారు. అతను చెపాక్-తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు శాసనసభ సభ్యులు కూడా. ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. సనాతన ధర్మం నిర్మూలనకే తాను పాడతానని, సమానతా ధర్మం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో అధికారం కోల్పోయినా ఆందోళన చెందనని స్పష్టంగా అభిప్రాయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ, రాజకీయ జీవితంపై బురదజల్లె విధంగా ప్రయత్నాలు చాలా జరిగాయి. కానీ వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.
సినిమా జీవితం
ఉదయనిధి స్టాలిన్, రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై 2008లో విజరు, త్రిష హీరోహీరోయిన్లుగా 'కురువి' చిత్రం నిర్మించి, నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆధవన్, మన్మధన్ అంబు, 7 ఓమ్ అరివు (2011) వంటి చిత్రాలకు పనిచేశారు. 2013లో స్టాలిన్ స్వంతంగా నిర్మాణ సంస్థ స్థాపించారు. మొట్టమొదట 'ఒరు కల్ ఒరు కన్నాడి' చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం ఫైనాన్స్‌పరంగా మంచి విజయం సాధించింది. స్టాలిన్ తన పాత్రకు అనేక అవార్డులూ వచ్చాయి. తన నటనకు ఉత్తమ తొలి నటుడిగా, ఫిలింఫేర్ అవార్డు - సౌత్ నుంచి వచ్చాయి. ఉత్తమ నూతన నటుడిగా నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
మొదటి సినిమాతోనే మంచి నటుడుగా గుర్తింపు రావడంతో వరసగా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత 'ఇదు కతిర్వేలన్ కాదల్ ', నన్బెండా, గేతు, మనితన్ (2016) వంటి అనేక చిత్రాలలో నటించారు. ఉదయనిధి శరవణన్ ఇరుక్క బయమేన్ , పొదువగా ఎన్ మనసు తంగం, ఇప్పడై వెల్లుమ్ (2017) వంటి చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తీసిన డ్రామా చిత్రం 'అరైజ్', శీను రామసామి దర్వకత్వంలో తీసిన రొమాంటిక్ డ్రామా చిత్రం ' కన్నె కలైమానే' లో నటించారు. స్టాలిన్ 2020లో సైకోలాజికల్ థ్రిల్లర్ చిత్రం 'సైకో'లో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. చివరిగా రాజకీయ నాటకీయంగా తీసిన 'నెంజుకు నీది' లో కనిపించడం ద్వారా నటుడిగా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించి అభిమానులకు మరింత దగ్గరయ్యారు.
స్టాలిన్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అధిపతిగా ఉన్న కృతికను పెళ్లి చేసుకున్నారు. ఆమె 'ఇన్‌బాక్స్ 130 వణక్కం చెన్నై', కాళి చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పేరు : ఉదయనిధి స్టాలిన్
జననం : 1977 నవంబరు 27(వయసు 45)
నివాసం : చెన్నై
వృత్తి : నిర్మాత, డిస్ట్రిబ్యూటర్,నటుడు, రాజకీయ నాయకుడు
భార్య : కృతిక
పిల్లలు : ఇంబనితి (కొడుకు), తన్మయ (కూతురు).