ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మహనీయుడని, ఆయన ఆశయాలు అనుసరణీయమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కొనియాడారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం వేడుకలు శనివారం జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాలులో నిర్వహించిన ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్, మైనార్టీ నాయకులు ప్రభతులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ భారతదేశంలో విభిన్న మతాలు సంస్కతులు కలిగి ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటే అంటూ హిందూ ముస్లిం ఐక్యతకు కషిచేసిన మహనీయుడని కొనియాడారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా, విద్య ప్రాధాన్యతను గుర్తించి, విద్యతోనే అభివద్ధి సాధ్యమని చాటి చెప్పిన గొప్ప దార్శనికుడని అన్నారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ బి.సత్యనారాయణ సింగ్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ కె. రాంబాబు, క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ జానీ, ఆర్డీవో ఎం వాణి, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య పాల్గొన్నారు.