ప్రజాశక్తి - వేటపాలెం
కుందేరు మురుగు కాలువ ఆధునికరణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సూచించారు. చీరాల నుండి వేటపాలెం వరకు విస్తరించి ఉన్న కుందేరు మురుగు కాలువ ఆధునీకరణ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. చీరాల కోర్టు సెంటర్, అక్కయ్యపాలెం బైపాస్, చల్లారెడ్డిపాలెం విద్యా స్కూల్ వెనుక, వేటపాలెం, రామన్నపేట బైపాస్ జంక్షన్‌లో ఉన్న కుందేరు డ్రైన్ తూములను పరిశీలించారు. కుందేరుపై బ్రిడ్జిల వద్ద పూడిక తియుట, జమ్మూ, తూటికాడ, గురపు డెక్క తొలగింపు జరుగుతున్న పనులు పర్యవేక్షించారు. చల్లారెడ్డి పాలెం, అక్కయ్యపాలెం, చేనేతపురి ప్రజలు తాగు నీరు, విద్యుత్ సమస్యలు గురించి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పృధ్వీ ధనుంజయ, దొనెంపూడి తిమోతి, ఎంపీడీఒ నేతాజీ, డ్రైనేజీ డిఈ సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎఈలు కాలేషా, రామ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ శివలీల, పూర్ణ కుమారి పాల్గొన్నారు.