ప్రజాశక్తి -సీలేరు
అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకొని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు జీకే వీధి సిఐ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సిఐ కథనం ప్రకారం... జీకే వీధి మండలం సంకాడ పంచాయతీ నిమ్మలపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని ముందు సమాచారంతో జికె.వీధి ఎస్సై అప్పలసూరి, సిబ్బంది దాడులు నిర్వహించి 38 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం బాటిళ్లు విక్రయాలు చట్టరీత్యా నేరమని, అటువంటి కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అప్పలసూరి పాల్గొన్నారు.