Nov 10,2023 23:26

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ : పుట్టుమూగ అయిన నిరుపేద కార్మికునికి జనసేన పార్టీ ఇంచార్జ్‌ బండి రామకృష్ణ శుక్రవారం ఆర్థిక సహకారం, నిత్యవసరాలు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని 26 వ డివిజన్‌ కు చెందిన పుట్టుమూగైన గండేపల్లి గోవిందరావు చిన్ననాటి నుండి కష్టపడి జీవనం సాగిస్తున్నారని ఇటీవల కంటి ఆపరేషన్‌ చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కారణం చేత వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహకారం, నిత్యవసర వస్తువులు అందజేశామనిరామకృష్ణ తెలిపారు. దాతలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధితునికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు,వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ సమీర్‌, డివిజన్‌ ఇన్చార్జిలు భీరం సుదర్శన్‌, పాల్గొన్నారు. అలాగే శనివారం హైదరాబాద్‌ లో జరిగే విశ్వరూప మహాసభ కు మచిలీపట్నం నుండి బయలుదేరి వెళ్ళుటకు గాను జనసేన పార్టీ ఇంచార్జ్‌ బండి రామకష్ణ 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులుకొల్లూరి బసవ, బీడెల్లి మరియ కుమార్‌, శీలం శర్మ, మట్ట జయప్రకాష్‌, మట్ట గోపాలకష్ణ పాల్గొన్నారు.