హిందూపురం : కనుచూపు మేర కనిపించే అడవుల సంరక్షణ కోసం ప్రభుత్వలు చేసిన చట్టాలను కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు చట్టాలను చూట్టాలుగా మార్చుకుంటున్నారు. జిల్లాలో అటవీ శాఖ చట్టలు కనుచూపు మేర కనిపించకుండా చేశారన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యేక్ష నిదర్శనం హిందూపురం ప్రాంతమే లేపాక్షి మండలం కొండూరు పరిసర ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రతిరోజూ కొందరు యంత్రాలతో పనులు నిర్వహిస్తున్నారు. తద్వారా వన్యప్రాణులు సంరక్షణ లేక భయభ్రాంతులకు గూరవుతున్నాయి. దీంతో వన్య ప్రాణులు అడవులను వదిలేసి జనావాసాలలో తిరుగుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఇంతజరుగుతున్నా వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. వేల ఎకరాల ప్రయివేటు భూములకు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దారిని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. దీంతో ప్రయివేటు భూముల వారు అడవుల్లో ఏర్పాటు చేసిన దారిగుండా ప్రతిరోజూ యంత్రాలు, వాహనాలు వెళ్లడమే కాకుండా ఆ దారికి ఇరువైపులా చెట్లు మొలవకుండా వేర్లతో సహా తొలగిస్తూ ఆ దారిని శాశ్వత రస్తాగా మారుస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ లోపాయికారి ఒప్పందం చేసుకుని వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ ప్రాంతాలలోని పనులు ఉపాధి హామీ పథకం కింద నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటించకుండా యంత్రాలతో పనులు చేస్తూ ఆయా గ్రామల ప్రజలకు సైతం ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు రాక కరువు ఛాయలు అలుముకున్న సత్యసాయి జిల్లాలో అడవులు, రెవెన్యూ భూములలో సైతం యథేచ్ఛగా చెట్లునరికి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీలకు కలప లోడుచేసి అక్రమంగా గోవాకు సైతం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తంతు మొత్తం అటవీ అధికారులే నిర్వహిస్తున్నారని సంబంధిత ప్రాంత ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా జిల్లాలో ప్రతిరోజూ కొన్ని వేలచెట్లు అక్రమంగా నరికి సామిల్లులకు, ఇటుక బట్టీలకు, పరిశ్రమల్లోని బాయిలర్లకు సైతం తరలిస్తున్నారు. ఈ తథాంగం మొత్తం అటవీ అధికారులకనుసల్లోనే జరుగుతోందని తెలుస్తోంది. అడవులు సైతం తొలగిస్తూ వేల ఎకరాలలో అటవీ అధికారులు ప్రతి సంవత్సరం అడవులను తొలగిస్తూ., ఆ కలపను బొగ్గు మాఫియా కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టడానికి కొత్త మొక్కలను నాటుతున్నారు. నాటడానికి యంత్రాలను వినియోగిస్తున్నారు. వాటిని సంరక్షణ చేయడం లేదు. అడవులు లేక పోవడంతో వన్యప్రాణులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి. అడవులు లేక పోవడంతో జనవాసాల్లో వన్య ప్రాణులు వస్తున్నాయి. ఇలా వచ్చి గత సంవత్సరం ఒక చిరుత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. అడవిలో శబ్ధాలకు తట్టుకోలేక ఒక చెరువు దగ్గర వచ్చి చిరుత చనిపోయింది. వన్య ప్రాణుల చట్టం మేరకు అడివిలో పెద్ద యంత్రాలతో పనులు చేయరాదు. అయినప్పటికీ యంత్రాలతో పని చేయడం వల్ల వన్యప్రాణులు బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. వన్యప్రాణుల చట్టం ఫారెస్ట్ అధికారులకు వర్తించదా అని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. సమస్త జీవరాసులకు ఆలవాలమైన అడవులను, చెట్లను రక్షించి, కరువు ప్రాంతాన్ని కాపాడాలని ప్రభుత్వం తీసుకోచ్చిన వాల్టా చట్టాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై సమగ్ర జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి కన్జర్వేషన్ అన్న పదాన్ని విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.