ఎలన్ మస్క్ మస్క్ యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X(ట్విట్టర్)కు ఆస్ట్రేలియన్ రెగ్యులేటర్ భారీ జరిమానా విధించింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నపిల్లల లైంగిక వేధింపుల కంటెంట్ కేసులో విచారణకు సహకరించడంలో విఫలమైనందున ఆస్ట్రేలియన్ రెగ్యులేటర్ ఆగ్రహించింది. దీంతో ఏకంగా 386,000 యుస్ డాలర్లు(దాదాపు రూ.3.21 కోట్లు) భారీ జరిమానా విధించింది. తాజాగా ఈ భారీ జరిమానాల నేపథ్యంలో స్పాన్సరర్లను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎక్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌పై నిత్యం సామాజిక మాధ్యమాల్లో నిఘా ఉంటుంది. ఆయా సైట్లు ఈ రకమైన కంటెంట్‌ను ఎంత త్వరగా గుర్తించారు? పరిష్కరించారన్న విషయంపై కూడా నిత్యం నియంత్రణ సంస్థల నిఘా ఉంటుంది.