బాస్కెట్‌బాల్ పోటీల్లో ఎస్‌డిఆర్ విద్యార్థిని ప్రతిభ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ఎస్‌డిఆర్ స్కూల్ విద్యార్థిని కె.హర్షిత ప్రతిభ చాటింది. శనివారం నంద్యాలలోని ఎస్‌డిఆర్ విద్యాసంస్థలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కె.హర్షితను ప్రిన్సిపల్ విజరు శేఖర్, చైర్మన్ శనివారపు కొండారెడ్డిలు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజరు శేఖర్ మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు మదనపల్లిలో జరిగిన 67వ అండర్-14 స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలలో కె.హర్షిత కర్నూలు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిందని తెలిపారు. కర్నూలు జిల్లాను మూడవ స్థానంలో నిలుపుటలో ముఖ్యపాత్ర పోషించిందని చెప్పారు. చైర్మన్ శనివారపు కొండారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బాస్కెట్ బాల్ క్రీడలో మూడవస్థానం సాధించిన కె.హర్షితను అభినందించారు. ఇకముందు జాతీయస్థాయి పోటీలకు కూడా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. హర్షితని క్రీడలలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. విజయానికి కారణమైన కోచ్ ముక్కమల్ల నవీన్ కుమార్‌ను అభినందించారు.