చికిత్స కన్నా నివారణే ముఖ్యం
డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: ప్రాణాలు తీసే క్యాన్సర్, గుండె వ్యాధుల విషయంలో చికిత్స కన్నా ముందస్తు నివారణే ముఖ్యమని ప్రముఖ ఎముకల వైద్యనిపుణుడు, వ్యాపార, రాజకీయవేత్త డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు అన్నారు. మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి డీకే సత్యప్రభ మూడవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రోటరీక్లబ్ ఆవరణలో ఆదివారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. తిరుపతికి చెందిన వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైట్‌ఫీల్డ్ (బెంగుళూరు) సంస్థ సంయుక్తంగా గుండె, క్యాన్సర్, ఆర్థో విభాగాలకు సంబంధించి వైద్యశిబిరం నిర్వహించడం జరిగింది. సుమారు 200 మంది రోగులు శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్య సేవలు పొందారు. 16 మందిని ఆపరేషన్ల నిమిత్తం తిరుపతి వైదేవి ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ రాజేష్ నాయుడు మాట్లాడుతూ గుండె, క్యాన్సర్ రోగాలను తొలి దశలోని గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయచ్చని చెప్పారు. వైదేహి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.