ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : టిడిపి అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాష్ట్రహైకోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం పట్ల పార్వతీపురం నియోజకవర్గ టిడిపి నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజకీయ కక్షల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన కేసుల్లో ఏకోశానా అవినీతి జరిగినట్లు నిరూపించకపోవడంతో ప్రజల ముందు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా నిలబడిందని, చంద్రబాబు నిజాయితీ నిరూపణ అయ్యిందని అన్నారు. త్వరలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో తీర్పు వెలువడితే అన్ని కేసులు రద్దు అవుతాయని అన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, నియోజకవర్గ ఇన్‌చార్జీ బోనెల విజయచంద్ర, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డిశ్రీదేవి, కౌన్సిలర్లు కెనారాయణరావు, కోలసరితామధు, బడేగౌరినాయుడు, తాతపూడివెంకటరావు, పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు జిరవికుమార్, బోనుచంద్రమౌళి, నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, బార్నాలశీతారం, తదితరులున్నారు.
కురుపాం : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకు స్థానిక టిడిపి కార్యాలయంలో మండల కన్వీనర్ కె.వి కొండయ్య ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి మందు గుండ సామాగ్రిని సంబరాలు చేశారు. కార్యక్రమం లో టిడిపి నాయకులు కిమిడి రామరాజు , సుఖేష్ చంద్ర పండ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.