Nov 15,2023 00:56

మాట్లాడుతున్న న్యాయమూర్తి ప్రవీర్‌


ప్రజాశక్తి-అడ్డతీగల
స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడ్డతీగల జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ప్రవీర్‌ ముఖ్య అతిథిగా హాజరై న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. విద్యార్థులు పిల్లలకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. సహ విద్యార్థుల పట్ల స్నేహభావంతో మెలిగి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రూపొందించుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు చేసిన వంటలను పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వహణను చూసి, మెరుగైన వాతావరణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. స్నానపు గదులు నిర్మాణానికి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని, అక్కడ ఉపాధ్యాయులు తెలపడంతో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదో తెలియజేయాలని కోరారు. తదుపరి ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు డి శ్రీధర్‌, ఈ.గౌరీ శంకర్‌ పాల్గొన్నారు.