ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్ : రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా డాక్టర్ జి.సమరం సమాజానికి అందించిన సేవలు అభినందనీయమని పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్, లయన్, డాక్టర్ పుట్టగుంట సతీష్ కుమార్ అన్నారు.రెడ్ క్రాస్ సంస్థ ద్వారా విశేష సేవలను అందించిన్న డాక్టర్ సమరం కు ఇటీవల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్న సందర్భంగా హనుమాన్ హనుమాన్ జంక్షన్ లోని తన ఫామ్ హౌస్ లో డాక్టర్ సమరం ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పుట్టగుంట మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం తన ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్ధంగా సేవలు అందించిన డాక్టర్ జి సమరం బావితరాలకు ఆదర్శంగా నిలిచారని గత 50 సంవత్సరాలకు పైగా డాక్టర్ సమరం చేస్తున్న సేవలు నిరూపమానమని ప్రశంసించారు. ఒకపక్క డాక్టర్ గా మరో పక్క సమాజానికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వై ఎస్ ఆర్ జీవిత సౌఫల్య పురస్కారాన్ని అందించారు. డాక్టర్ సమరం కు జరిగిన అభినందన సభలో విజయవాడకు చెందిన పలువురు డాక్టర్స్, లయన్స్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పి డి జి మిరియాల వెంకటేశ్వరరావు ,డాక్టర్ బుచ్చిబాబు ,రామిశెట్టి కొండలరావు , దండమూడి స్టాలిన్ డాక్టర్ త్రిపురనేని త్రిపిర్నేని హరినాథ్ పద్మ, నందిగం స్వామి, లయన్స్ జిల్లా పి ఆర్ ఓ తాడి రంగారావు, అక్కినేని ఫణీంద్ర, లయన్ వేజెండ్ల ప్రతాప్, లయన్ భూమా సంపత్ తదితరులు పాల్గొన్నారు.