ప్రజాశక్తి-అమలాపురం
అమలాపురం స్థానిక వెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల్లో శుక్రవారం దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ వారు ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 116 అభ్యర్థులు పాల్గొన్నారు. ఎమ్‌ఎస్‌సి క్వాలిఫికేషన్‌తో రూ.4.2 లక్షలు, బిఎస్‌సి కెమిస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ తో రూ.2.92 లక్షలు వార్షిక జీతంతో 26 మందిని ఎంపిక చేసి కంపెనీ హెచ్‌ఆర్‌లు ఎ.రాజేష్, పి.రామకష్ణ, సిహెచ్ పూర్ణప్రసాద్‌లు అపాయిన్మెంట్‌ను అందించినట్లు ప్రిన్సిపల్ కెఎస్‌విఎన్.మనో తెలిపారు. తమ కళాశాల నుంచి బిఎస్‌సి బయో కెమిస్త్రీ విద్యార్ది కోలిసెట్టి నీహారిక ఎంటిసి సాఫ్ట్‌వేర్ కంపెనీకి సెలెక్ట్ అయినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్ధులను ప్రిన్సిపల్ మనోహర్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కెవిఆర్‌ఎన్.నరసింహారావు, మల్లిపూడి విజయలక్ష్మి, సేవారత్న కరాటం ప్రవీణ్, ఎండి కె.శ్రావణ్ దిలిప్, డాక్టర్ హేమవిజిత, వై.వరప్రసాద్, శ్రీనివాస్, సిహెచ్.జాన్ పాల్, ఇ.శ్రీలక్ష్మి, ఎమ్.సూర్య కుమారి తదితరులు అభినందించారు.