Nov 12,2023 13:32

ఆపకు నీ ప్రయాణం, దేనికి భయపడి
ఈ రాతిరి మాసిన వెలుగు
రేపటి నీకై రగులుతూ ఎదురవుతుంది
సాగే సెలయేరు దారి తప్పకుండా
నీకు బాట వేస్తుంది
కొండగాలి నువ్వు కృంగకుండా భుజం తడుతుంది
విశ్వమంతా తలుపు తెరిచి
నిన్ను ఆహ్వానిస్తుంది
అవసరాలు ముడివేసిన బంధాలివి
సమాజానికి భయపడి కలిసున్న బంధాలివి
కన్న బాధ్యతను మోస్తున్న బంధాలివి
గతిలేక సాగుతున్న బంధాలివి.
ఆగిపొమ్మంటున్న ప్రాణం
కదిలి పొమ్మంటున్న కాలం
రెండింటి మధ్య పొత్తు కుదరక
నలిగిపోతున్న జీవితం
.కన్నీటిని దాస్తున్న కన్నులు
అబధ్ధంగా నవ్వుతున్న పెదవులు
నాపై నేను దూరమవుతున్న కాలం
నచ్చకపోయినా నటించాల్సిన గతి
ఇంకొ కాలమంటూ,
ఇంకొంత దూరమంటూ
వ్యర్థమవుతున్న జీవితం !

టి. దివ్యరాణి
7వ తరగతి, జెవిఎంసి హైస్కూలు, ప్రకాష్‌రావు పేట, విశాఖపట్నం.