Nov 20,2023 22:59

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గోదావరి తీరంలో నిర్వ హిస్తున్న గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగ విజయ వంతం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులు, గోదావరి బాలో త్సవం నిర్వాహకులు సంయుక్తంగా బాలోత్సవం గోడపత్రికను ఆవిష్క రించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలోత్సవం రెండవ పిల్లలపండుగ విజయవం తం కావాలని ఆశభావం వ్యక్తం చేశారు. బాలోత్సవం నిర్వాహకులు పి.తు లసి, పి. మురళీకృష్ణ, డి. సాయి బాబా మాట్లాడుతూ గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండు గను 2024 జనవరి 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్‌, రూ రల్‌, కడియం మండలం తోపాటు రాజానగరం, సీతానగరం, కోరు కొండ మండలాలను కలుపుకుని మొత్తం 6 మండ లాల్లోని, ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో చదివే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరూ పాల్గొనవచ్చని తెలిపారు. కల్చరల్‌, అకాడమిక్‌ విభాగాల్లో 32 అంశాల్లో 60 పోటీలను సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో నిర్వహిస్తామన్నారు. రెండు రోజుల పాటు ఒకే ప్రాంగణంలో వివిధ వేదికలపై వందలాదిమంది పిల్లల తో కన్నులపండుగగా జరిగే ఈ రెండవ పిల్లలపండుగను జయ ప్రదం చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫిలాంత్రోఫీక్‌ సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ రాజ యోనా, పి.రామకృష్ణ, కామేశ్వర శర్మ పాల్గొన్నారు.