ప్రజాశక్తి - వేపాడ : గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నామని వావిలపాడు సర్పంచ్ బీల రాజేశ్వరి చెప్పారు. ఆమె మంగళవారం ప్రజాశక్తితో మాట్లా డారు. ఈ గ్రామంలో టిడిపి హాయామంలో ఎటు వంటి అభివృద్ది జరగలేదు. వైసిపి సర్పంచ్‌గా నేను రెండు సార్లు విజయం సాధించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేశాను. రూ. 25లక్షలతో గ్రామ సచివాల యాన్ని నిర్మించాం. రూ. 20లక్షలతో వెల్నెస్ భవనం, ఆర్‌బికె నిర్మాణాలను కూడా పూర్తి చేస్తున్నాం. గడపగ డపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నిధులు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో రెండు కమ్యూనిటీ భవనాలు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. పంచాయతీ నిధులతో రెండు సిసి రోడ్ల నిర్మాణానికి తీర్మానం చేశాం. ఇంటి స్థలం లేని వారిని 12 మందిని గుర్తించి వారికి పక్కా గృహాలు మంజూరు చేశాం. కడకొండ గిరిజన గ్రామానికి జలజీవన్ మిషన్ ద్వారా రూ.5.45 లక్షలు, సంజీవమెట్టకు రూ. 6లక్షలు వెచ్చించి ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం. నాడు నేడు నిధులు రూ. 9.30లక్షలతో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులు చేపడుతు న్నాం.దీంతో పాటు ప్రాథమిక పాఠశాల ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా చేపడుతున్నాం. గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ ద్వారా రూ.80 లక్షల మంజూరు చేశారు. నిధులు విడుదలైన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేపట్టి ప్రతి ఇంటికి తాగునీరు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటాం. ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలకు చేపడు తున్న పనులకు ఏ విధమైన పొంతనాలూ లేవు. గ్రామంలో చేపడుతున్న ప్రతి అభివద్ధి పని పాలకవర్గ సభ్యులు ఆమోదం మేరకే చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.