Nov 15,2023 21:42

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం గ్రంథాలయాల్లో పుస్తక ప్రదర్శన జరిగింది.
అమలాపురం అమలాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంధాలయం నందు 2వరోజు పుస్తక ప్రదర్శనను ఎంఇఒ గుబ్బల సూర్య ప్రకాష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మరొక ఎంఇఒ ఎస్‌.దుర్గాదేవి మహాత్మ గాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం బిఆర్‌.కామేశ్వరరావు, తెలుగు ఉపాధ్యాయడు చంద్రమోహన్‌ విద్యార్థులు, స్థానిక శారద కాన్వెంట్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామచంద్రపురం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం పట్టణంలోని గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాలైన పుస్తకాలు, గ్రంథాలను ప్రదర్శనకు ఉంచారు. వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్లత్వ పోటీలు నిర్వహించారు.కార్యక్రమములో మందనక్క రాజేంద్ర, మణి, కిరణ్‌, జి.మౌనిక, శ్రీదేవి పాల్గొన్నారు. గ్రంథపాలకులు దడాల వెంకట రమణ, వనిజాక్షి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. మండపేట గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్ధానిక గ్రంథాలయంలో 'పుస్తక ప్రదర్శన'ను ఉపాధ్యాయులు ఎల్‌. శ్రీనివాసరావు ప్రారంభించారు. పలువురు మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వలన జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెంపొందించుకోవచ్చున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయాధికారి ఎస్‌.పూర్ణమ్మ పాల్గొన్నారు. కపిలేశ్వరపురం గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకురాలు డి.శివకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, పుస్తక ప్రదర్శన నిర్వహించారు. తొలుత సరస్వతి దేవికి పూజలు నిర్వహించి పుస్తక పఠనం ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శాఖ శ్రీనివాస్‌, ఎంపిటిసి సభ్యులు శీలం భాస్కరరావు, ఉప సర్పంచ్‌ బొక్క రాంబాబు, పీతల బంగారం, కుడిపూడి విజరు కుమార్‌, చింతా పెద్దబాబు , పిప్పర సంపత రావు తదితరులు, పాల్గొన్నారు. ఉప్పలగుప్తం శాఖా గ్రంధాలయంలో గ్రంథాలయాధికారి సలాది నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల రెండో రోజు బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎన్‌టిపిసి విశ్రాంత డిప్యూటీ మేనేజర్‌, ప్రధానమంత్రి శ్రమ భూషణ అవార్డు గ్రహీత ఎస్‌..పుల్లారావు ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆత్రేయపురం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రెండవ రోజున జిల్లా గ్రంథాలయ సంస్థ నూతనంగా సరఫరా చేసిన పుస్తకాలను ప్రదర్శన ఏర్పాటు చేశామని గ్రంథాలయ నిర్వహణ అధికారి తమ్మ నమశివాయ అన్నారు. ఈ ప్రదర్శనను మహాత్మా గాంధీ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ మరియు ఆత్రేయపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు పిఎస్‌.రాజు ప్రారంభించారు