ప్రజాశక్తి - పాలకోడేరు
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గొల్లలకోడేరు గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. సుమారు 60 మంది విద్యార్థులు ఈ క్విజ్పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి జి.బాలరాజు విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందిం చారు. విద్య గొప్పతనన్ని వివరించడంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకునే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ విక్టర్పాల్ పాల్గొన్నారు.
పోడూరు : మండలంలోని జిన్నూరు శాఖా గ్రంథాలయంలో డ్రాయింగ్, క్విజ్ పోటీలు, పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలను ఉపాధ్యాయులు కె.శ్రీనివాస్, జిఎ.నరసింహరావు నిర్వహించారు.
పెనుమంట్ర : మార్టేరు రోటరీలో 35 మంది విద్యార్థులు దేశభక్తి గీతాలు, పాటల పోటీలు నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారి పిటి.శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమానికి మానవత పెనుమంట్ర శాఖ అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, కార్యదర్శి శ్రీనివాసుల మురళీకృష్ణ, సంగీతం మాస్టర్ జె.రాజకుమార్ మాస్టారు, చదువుల సుబ్రహ్మణ్యం మాస్టారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
పాలకొల్లు : డిజిటల్ లైబ్రరీలను ప్రజలు ప్రోత్సహించాలని విశ్రాంత ఎంఇఒ యర్రా అజరుకుమార్ చెప్పారు. పాలకొల్లు శాఖా గ్రంథాలయంలో డిజిటల్ గ్రంథాలయాలు-ఉపయోగాలు అంశంపై ఆయన మాట్లాడారు. మారుతున్న ఆధునిక సాంకేతికకు అణుగుణంగా లైబ్రరీలు ఆధునీకత జరగాలని కోరారు. గృహిణులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలకు డిజిటల్ లైబ్రరీలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. గ్రంథాలయ అధికారి వి.శాంతకుమారి, సిహెచ్.పెద్దిరా జు, మల్లయ్య, సత్యనారాయణ, సత్యవాణి పాల్గొన్నారు.
ఉండి : ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉండి శాఖా గ్రంధాలయం అధికారి జక్కంపూడి వెంకటకృష్ణమూర్తి అధ్యక్షతన సైబర్ నేరాలు, లోన్ యాప్, దిశా చట్టాలు, మాదకద్రవ్యాల గురించి విద్యా ర్థులకు మహిళా పోలీసులు ఎం.కుమారి, ఎన్.వాహిని, ఎండి ఫాతిమా, వై.రేవతి అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై.రామలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యలమంచిలి : మండలంలోని చించినాడ గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాచరచన, క్విజ్పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సుమారు 50 మంది పాల్గొన్నారు. పో టీలకు పరిశీలకులుగా ఎం.మామూళ్లు, ఆర్లపాడు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అడ్డాల నరసింహరావు వ్యవ హరిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, గ్రంథా లయ నిర్వాహకులు ఎస్.సుబ్రహ్మణ్యశర్మ పాల్గొన్నారు.