Nov 18,2023 00:23

56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని పలు శాఖా గ్రంథాలయాల్లో విద్యార్థులకు


56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని పలు శాఖా గ్రంథాలయాల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.
ప్రజాశక్తి- యంత్రాంగం

కశింకోట : కశింకోట గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు జరిగాయి. విశ్రాంతి ఉద్యోగి నంబా రమణ, ఉపాధ్యాయులు అప్పారావు, రామచంద్రరావు, గ్రంథాలయం అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు. తాళ్ళపాలెం శాఖ గ్రంధాలయంలో గ్రంథాలయం అధికారి కాండ్రేగులు జగన్‌ ఆధ్వర్యాన విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు.
మునగపాక రూరల్‌ : స్థానిక శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణీతులుగా కిల్లాడ ప్రసాదరావు, శివకోటి దుర్గాప్రసాదు వ్యవహరించారు. గ్రంధాలయాధికారి ఎల్వి రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఆశాదేవి పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : బుచ్చయ్యపేట శాఖా గ్రంధాలయంలో పాఠశాల విద్యార్థులకు దేశభక్తి గేయాలపై పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కృష్ణారావు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : దేవరాపల్లి శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి ఓ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉషోదయ స్కూల్‌, కైరాయి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, కాశీపురం ఎంపీపీ స్కూల్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణీతలుగా కొటాన రాంబాబు, కాటపల్లి సందీప్‌ కుమార్‌, ఛాయాదేవి, లావణ్య వ్యవహరించారు.
అనకాపల్లి : స్ధానిక శాఖాగ్రంథాలయంలో శుక్రవారం అనకాపల్లి సాహితీమిత్రులచే కవిసమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాహితీమిత్రులు కన్వీనర్‌ డాక్టర్‌ యిమ్మిడిశెట్టి చక్రపాణి గ్రంథాలయాలు-సాహిత్యం గురించి ప్రసంగించారు. ప్రముఖ కథారచయిత గొంతిన రంగబాబు నిర్వహణలో జరిగిన కవి సమ్మేళనంలో కవులు పుస్తకాలు, గ్రంథాలయాలు తదితర అంశాలపై కవితలు, పాటలు వినిపించారు. కార్యక్రమంలో గొంతిన రంగబాబు, రాయవరపు సరస్వతి, రేగురగడ్డ వెంకట లక్ష్మీ, గాయత్రి, జిఎస్‌కె.సాయిబాబా, తదితర కవులను గ్రంథాల యాధికారి కె.శ్రీనివాస్‌ సత్కరించారు. సమన్వయకర్తగా బళ్ళా నాగభూషణం వ్యవహరించారు. గ్రంథాలయ అధికారులు ఎల్‌.వి.రమణ, బి.వి.రామప్పారావు, రామారావు, భరణి పాల్గొన్న సభకు కోరాడ అప్పలరాజు వందన సమర్పణ చేశారు.
కోటవురట్ల: స్థానిక గ్రంథాలయ అధికారి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన, సభ్యత్వ స్వీకరణ నిర్వహించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చీడికాడ:శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిని ఎంఎస్‌ఎల్‌ జోగేశ్వరి మాట్లాడుతూ, ఈ క్విజ్‌ పోటీలకు చీడికాడ, తురువోలు, ఖండివరం ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారని ఆమె అన్నారు
నక్కపల్లి:మండలంలోని చినదొడ్డుగల్లు గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జనార్దన్‌ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పిడి ఆదిలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, మ్యూజికల్‌ చైర్‌ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు ముగింపు కార్యక్రమం రోజున బహుమతులు అందజేయనున్నట్లు జనార్ధన్‌ తెలిపారు .
గొలుగొండ:శాఖా గ్రంధాలయాధికారి రాజుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ, గ్రంధాలయాలు వాటి ప్రయోజనాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలకు గొలుగొండ అంబేద్కర్‌ గురుకుల విద్యార్థులు 26 మంది హాజరయ్యారన్నారు. అనంతరం పఠన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామనాయుడు, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
భీమునిపట్నం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక శాఖా గ్రంధాలయంలో విద్యార్ధులకు గ్రంథాలయాల ఉపయోగాలు అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముందుగా ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ మహేష్‌, మాజీ కౌన్సిలర్‌ ఎం లక్ష్మణరావు పాల్గొన్నారు
పెందుర్తి: స్థానిక శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం లైబ్రేరియన్‌ బి.సూర్యకళ ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహులు, ఉద్యమకారులు ఎస్‌ఆర్‌ రంగనాథన్‌, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వైస్‌ ప్రెసిడెంట్‌ పెతకంశెట్టి భూలోకరావు, కార్యదర్శి ఆడారి రామకృష్ణ, పెంటకోట గణేష్‌ పాల్గొన్నారు .
ములగాడ: మల్కాపురంలోని శాఖా గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం లైబ్రేరియన్‌ వి.అజరుకుమార్‌ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం హృద్యమంగా సాగింది. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు టి .శ్రీరామమూర్తి 'ఎవరు ఆపగలరు' అనే కవితను, ఈశ్వరరావు 'చదువు'అనే కవితను, పాత్రికేయులు ఎస్‌.చలపతిరావు 'రండోరు- రారండోరు'అనే కవితను, కార్మిక నేతసత్యానందం 'నూతన పోకడలు' అనే కవితను, రచయిత కె.సత్తి రాజు 'మహిళ' అనే కవితను, న్యాయవాది జికెవి. రాజు 'స్వతంత్ర భారతావని' అనే కవితలను చదివి వినిపించారు. వీరిని ఎంఇఒ వెంకటరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి ఇ.పి.ఎస్‌. భాగ్యలక్ష్మి సత్కరించారు. సెయింట్‌ ఆన్స్‌ కళాశాల విద్యార్థినులు, ఎన్‌ఎస్‌ఎస్‌వాలంటీర్లు పాల్గొన్నారు .
సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో సదస్సు
సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలేజీ లైబ్రేరియన్‌ జి. శిరీష ఆధ్వర్యంలో 'గ్రంథాలయ ఉద్యమం'పై సదస్సు నిర్వహించారు. చరిత్ర అధ్యాపకురాలు జి. లలిత మాట్లాడుతూ, ఎస్‌ఆర్‌ రంగనాథన్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి గ్రంథాలయోధ్యమ ప్రముఖుల సేవలు యువత మరువరాదన్నారు.
రంగసాయి గ్రంథాలయంలో నాటక పుస్తక ప్రదర్శన
సీతమ్మధార : 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ద్వారకానగర్‌, రైల్వే స్టేషన్‌ రోడ్‌, టిఎస్‌ఆర్‌. కాంప్లెక్స్‌లోని దేశంలోనే తొలి నాటక గ్రంథాలయం 'రంగసాయి నాటక గ్రంథాలయం'లో ఈనెల 20 తేదీ వరకు, ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నాటకాల పుస్తకాలు, నాటకాల సాహిత్య పుస్తక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నాటక పుస్తక ప్రదర్శనకు విచ్చేసిన అఖిల భారత అవినీతి నిరోధక సమాఖ్య , ప్రజా సమస్యల పరిశోధన అధికారి బి. క్రాంతి మాట్లాడుతూ ఇటువంటి వినూత్నమైన నాటక గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. నగరానికి చెందిన పలువురు పాత్రికేయులు రంగసాయి నాటక గ్రంథాలయాన్ని సందర్శించి తమ అభిప్రాయాలను తెలియజేస్తూ బాదంగీర్‌ సాయిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టులు నాగనబోయిన నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, నాయుడు, మోహన్‌కృష్ణ, ఎల్‌.జి. నాయుడు, శేషు, అప్పలరాజు, కీర్తన పాల్గొన్నారు.