Nov 14,2023 00:44

పరిశీలిస్తున్న పిఒ

ప్రజాశక్తి-అరకులోయ:ఈనెల 15న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అరకులోయలో పర్యటించనున్న నేపథ్యంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అరకులోయలో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మూడు వాహనాలు ఏజెన్సీ మండలాలోని పంచాయతీలో పర్యటిస్తాయని చెప్పారు. గిరిజన సంస్కతి, సాంప్రదాయాలపై కార్ని వాల్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారులు వీఎస్‌ ప్రభాకర్‌, ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఐ. కొండల రావు, మ్యూజియం క్యూరేటర్‌ మురళి పాల్గొన్నారు.