రాజంపేట అర్బన్ : వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ విధానంతో నిర్మాణ రంగం కుదేలైందని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు అన్నారు. మంగళవారం మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జిఎంసి కల్యాణ మండపం16వ వార్డులో పర్యటిస్తూ భవన నిర్మాణ కార్మికులను పరామర్శించారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ విధానం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి రోడ్లపైనే చెత్తాచెదారం ఉండడంతో దుర్వాసనతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఏర్పడిందని తెలిపారు. తక్షణమే చెత్తకుండీలను ఏర్పాటు చేయాలని, ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఆర్.సతీష్రాజు, సీనియర్ నాయకులు జి.వి.సుబ్బరాజు, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, యువ నాయకులు నాగేంద్ర తులసి, వెంకటేష్ యాదవ్, ఎన్టీఆర్ కాలనీ హరి, సుధాకర్ పాల్గొన్నారు.