ప్రజాశక్తి-కొత్తపేట
సిఎం వైఎస్ జగన్ నాలుగు సంవత్సరాల 8 నెలల ప్రజా పాలనలో నూరు శాతం వివిధ వర్గాలకు సంక్షేమ అభివద్ధి పథకాలను పూర్తిస్థాయిలో అందించారని వైసిపి ప్రజాప్రతినిధులు అన్నారు. వైసిపి ఆధ్వర్యంలో గురువారం సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా కొత్తపేటలో ఎంఎల్ఎ జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు చెల్లిబోయిన వేణు గోపాలకష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఎంపీ మార్గాని భరత్, చింతా అనురాధ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, తదితర అగ్ర నాయకులు పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో వివిధ వర్గాలకు అమలు చేసిన పథకాలను వివరించారు రావులపాలెం సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎంఎల్ఎ చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ పాల్గొని మాట్లాడారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంఎల్సి కుడుపూడి సూర్యనారాయణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కొత్తపేట బహిరంగ సభకు తరలివెళ్లారు.