ప్రజాశక్తి - కొమరాడ : రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని విక్రమపురంలో మళ్లీ జగన్ ఎందుకు రావాలి అనే కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయం వద్ద వైసిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో గల రామమందిరం వద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలించాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయి పథకాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్ధన్, సీనియర్ నాయకులు మధుసూదనరావు, కలింగ మల్లేశ్వరరావు, ఎం.సూరపునాయుడు, దాసరి శ్రీధర్, జడ్పిటిసి లక్ష్మి, ఎంపిపి శ్యామల, సర్పంచ్ శైలజ, ఉప సర్పంచ్ సిరిపురపు రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : మండలంలోని వెంకంపేట, పెదబొండపల్లి సచివాలయాల్లో జరిగిన జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకంపేట సచివాలయం, ఆర్బీకేల నిర్మాణంచ ఇంటింటికీ తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పెదబొండపల్లిలో కూరగాయలు అమ్ముకునేందుకు ఆధునిక మార్కెట్ నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ బొమ్మి రమేష్, ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్పీటీసీ బలగ రేవతమ్మ, వైస్ ఎంపిపి సిద్ధ జగన్నాధరావు, బి.రవికుమార్, ఎంపిడిఒ, స్థానిక సర్పంచ్ తీల్ల కృష్ణారావు, సవరపు తౌడమ్మ, పిఎసిఎస్ చైర్మన్ తీల్ల శివు నాయుడు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పిడిలోవ, బిల్లగుడ్డివలసలో...
మండలంలోని పిడిలోవ, బిల్లగుడ్డివలస తదితర గిరిజన గ్రామాల్లో ఎపి టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులకు పొడు భూములపై శాశ్వత భూ హక్కు కల్పించడం, గిరిజన అటవీ భూమి సాగు చేసే వారికి కూడా రైతు భరోసా, భూమి లేని గిరిజనులకు అటవీ భూములపై హక్కు, డి పట్టా భూములపై హక్కులు కల్పించడం వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గిరిజనులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మక్కువ : మండలంలోని దబ్బగెడ్డలో ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి'' కార్యక్రమాన్ని జెడ్పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసునాయుడు, వైసిపి నాయకులు మావుడి రంగునాయుడు ఆధ్వర్యాన నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగన్ ఆంద్రాకు జగన్ ఎందుకు కావాలని, గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి గల వ్యత్యాసాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి మర్రి పారమ్మ, ఎంపిపి సీదారపు లక్ష్మి, వైసిపి నాయకులు రౌతు సాయి, కృష్ణ, పకీరు నాయుడు, నోడల్ అధికారి దేవకుమార్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, పాల్గొన్నారు.
భామిని : మండలంలోని నేరడిబిలో వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమం వైసిపి మండల కన్వీనర్ తోట సింహాచలం ఆధ్వర్యా నిర్వహించారు. తొలుత వైసిపి జెండాను ఎగురావేసి, వై సి పి సంక్షేమ పథకాలు లబ్దిదారులతో కూడిన జాబితాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఇంటింటి వెళ్లి వైసిపి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో నేరడి సర్పంచ్ సరిసభద్ర బాలయ్య, గురండి సర్పంచ్ జామి భైరగి, వైసి పి నాయకులు అర్లి రాజశేఖర్, వాలంటీర్లు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్రలో ఎపికి జగనే ఎందుకు కావాలన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉరిటి రామారావు, జెడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీ నాయుడులు సచివాలయాల పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బోర్డు ఆవిష్కరణతో పాటు జెండాను ఎగురువేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శెట్టి దివ్యలక్ష్మి, మండల పరిషత్ కార్యాలయ ఎఒ నాలి అర్జునరావు, ఇఒపిఆర్‌డి ఎల్.గోపాలరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి ఉప్పల పెదకోటేశ్వరరావు, గ్రామ సచివాలయాల ఎంఎల్‌ఒ పెరుమాళ్ల వాసు ఆచారి, తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని నడిమికెళ్లలో ఆంధ్రప్రదేశ్ కి జగనే సీఎం కావాలని కార్యక్రమం ఎంపిపి డి.వెంకటరమణ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్సర్పంచ్ సుజాత- శ్రీనివాసరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కేఎల్ ప్రసాద్, విక్రం పురం మాజీ సర్పంచ్ మాచర్ల వెంకటరమణ సచివాలయ కార్యదర్శి ఎన్ కోటేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.