ప్రజాశక్తి-అవనిగడ్డ : కయాకింగ్ కెనోయింగ్( జల క్రీడల) పోటీల్లో జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులను శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. శుక్రవారం అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి కయాకింగ్ కెనోయింగ్ పోటీలలో ద్వితీయ స్థానం సాధించిన నాగాయలంకకు చెందిన నాగిడి గాయత్రి, తతీయ స్థానం పొందిన నాగిడి భార్గవి, వన్ ప్లస్ వన్ కు అర్హత సాధించిన నాగిడి అశ్వినిని ఎమ్మెల్యే పుష్పగుచ్చాలు శాలువా లు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కోచ్ ని శిక్షణ పొందేందుకు ఆధునిక లైట్ వెయిట్ బోటుని అందించేం దుకు సహకరించాలని క్రీడాకారిణి గాయత్రి ఎమ్మెల్యేని కోరారు. హెవీ వెయిట్ బోటు ద్వారా శిక్షణ పొందటం కష్టంగా ఉందని విదేశీ లైట్ వెయిట్ బోటును అందిస్తే మరిన్ని పథకాలు అందుకోగలనని గాయత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ తో మాట్లాడి వాటిని సమకూర్చేందుకు కషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుక్కలు గడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు