ప్రజాశక్తి - అద్దంకి
నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం స్థానిక అంబేద్కర్ భవనంలో ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్, రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్ప నిజాయితీ పరుడని అన్నారు. ఆయన కోసం ప్రతి జనసైనుకుడు కష్ట పడి పనిచేయాలని అన్నారు. పార్టీ విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని అన్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ నిర్ణయించినట్లుగా టీడీపీతో సమన్వయంగా పని చేయాలని కోరారు. 2024ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్, అన్ని మండలాల అద్యక్షులు , వీర మహిళలు, జిల్లా కార్యదర్శులు, టౌన్ అద్యక్షులు, ప్రోగ్రాం కమిటీ మెంబెర్స్, వందలాదిగా జనసైనికులు హాజరు అయ్యారు.