ప్రజాశక్తి- వేపగుంట : వేపగుంటలోని జివిఎంసి జోన్-8 కార్యాలయంలో శుక్రవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఎసిబి అధికారులు శుక్రవారం ఉదయం 11 అకస్మాత్తుగా వచ్చి, కార్యాలయం తలుపులన్నీ మూసి లోపల ఉన్న సిబ్బందిని లోపలే ఉంచి తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులపై తనిఖీలు చేస్తున్నారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు ఉందో తనిఖీ చేపట్టారు. పలు భవనాలపై వచ్చిన ఫిర్యాదులపై స్వయంగా అక్కడికెళ్లి తనిఖీలు చేపట్టారు. డీజీ రాజేంద్రనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.
సచివాలయ పరిధిలో ఉన్న శానిటేషన్ సిబ్బందితో యూజర్ ఛార్జీలపై జోనల్ కమిషనర్ శుక్రవారం ఉదయం సమావేశం నిర్వహించారు. వారు సమావేశంలో ఉంటుండగా ఎసిబి అధికారులు వచ్చి తలుపులు మూసేయడంతో వారు కూడా సాయంత్రం వరకు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ దాడుల్లో అడిషనల్ ఎస్‌పి శ్రావణి, డిఎస్‌పి బి.రమ్య, సిఎ కిషోర్‌కుమార్, ఎసిపి టీం విశాఖపట్నం ప్రేమ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.