కబడ్డీలో క్రమశిక్షణతో మెలుకువలు నేర్చుకోవాలి
ఉమ్మడి జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి
ప్రజాశక్తి - పగిడ్యాల
కబడ్డీ శిక్షణలో క్రమశిక్షణతో మెలకువలు నేర్చుకోవాలని మాజీ జెడ్పిటిసి, ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి, ఎంఇఓ సుభాన్ అన్నారు. పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ 17 విభాగంలో బాలుర కబడ్డీ శిక్షణ శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు అధ్యక్షతన ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడాకారులు మంచి క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి తో పాటు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు సాధించాలన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడల్లో క్రమశిక్షణ పాటించినప్పుడే విజయం వరిస్తుందన్నారు. ముఖ్యంగా క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఎంతో అవసరమన్నారు. ఏ ఆట క్రీడాకారుడైన క్రీడా స్ఫూర్తి ఉన్నప్పుడే విజయాలు తనంతట తానే వరిస్తాయన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు మాట్లాడుతూ పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఇప్పటివరకు 23 వివిధ రకాల క్రీడల్గో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ప్రథమ స్థానం, ద్వితీయ, మృతి స్థానంలో నిలిచారన్నారు. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో జరుగు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రషీద్ మియ్య , పిడి కృష్ణ, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, జాతీయ కబడ్డీ గోల్డ్ మెడల్ కారుడు మోక్షేశ్వర్ రెడ్డి, క్రీడా శ్రీ తోకల పీతాంబ రెడ్డి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.